సీసము:
కుప్పించి యెగసిన కుండలంబుల కాంతి
గగన భాగంబెల్ల గప్పికొనగ,
నురికిన నోర్వక నుదరంబులోనున్న
జగముల వ్రేగున జగతి కదల,
చక్రంబు చేబట్టి చనుదెంచు రయమున
పైనున్న పచ్చని పటము జార,
నమ్మితి నాలావు నగుబాటు సేయక
మన్నింపుమని క్రీడి మరల దిగువ,
తేటగీతి:
కరికి లంఘించు సింహంబు కరణి మెరసి
నేడు భీష్ముని జంపుదు నిన్ను గాతు
విడువుమర్జునాయంచు మద్విశిఖ వృష్టి
దెరలి చనుదెంచు దేవుండు దిక్కు నాకు
భావం: ఊపిరి బిగపట్టి రథం మీదనుంచి ఒక్కసారిగా ఎగిరిన శ్రీకృష్ణుని చెవుల కుండలాలకు ఉన్న కాంతులు ఆకాశమంతా వ్యాపించాయి. అతని కడుపులో ఉన్న లోకాలన్నీ ఒక్కసారిగా కదిలి, అలజడి చెందాయి. ఆయన భుజం మీద వేలాడుతున్న పీతాంబరం కిందకు జారిపోయింది. చేతిలో చక్రాన్ని ధరించి వేగంగా మీదకు వెడుతుండగా, ‘‘నా శక్తి మీద నాకు నమ్మకం ఉంది, నన్ను నువ్వు నవ్వులపాలు చేయకు కృష్ణా’’ అని అర్జునుడు బతిమాలుతుంటే, ‘‘నన్ను అడ్డగించకు. ఈరోజు భీష్ముడిని చంపి, నిన్ను రక్షిస్తాను’’ అంటూ ఏనుగు మీదకు లంఘించే సింహంలాగ, నా బాణాలను తప్పించుకుని నా మీదకు ఉరుకుతూ వచ్చే ఆ కృష్ణుడే దిక్కు నాకు’’ అన్నాడు భీష్ముడు.
-- References Youtube, http://www.sakshi.com/main/Weeklydetails.aspx?Newsid=27675&Categoryid=13&subcatid=0, http://padyakaumudi.blogspot.in/
కుప్పించి యెగసిన కుండలంబుల కాంతి
గగన భాగంబెల్ల గప్పికొనగ,
నురికిన నోర్వక నుదరంబులోనున్న
జగముల వ్రేగున జగతి కదల,
చక్రంబు చేబట్టి చనుదెంచు రయమున
పైనున్న పచ్చని పటము జార,
నమ్మితి నాలావు నగుబాటు సేయక
మన్నింపుమని క్రీడి మరల దిగువ,
తేటగీతి:
కరికి లంఘించు సింహంబు కరణి మెరసి
నేడు భీష్ముని జంపుదు నిన్ను గాతు
విడువుమర్జునాయంచు మద్విశిఖ వృష్టి
దెరలి చనుదెంచు దేవుండు దిక్కు నాకు
భావం: ఊపిరి బిగపట్టి రథం మీదనుంచి ఒక్కసారిగా ఎగిరిన శ్రీకృష్ణుని చెవుల కుండలాలకు ఉన్న కాంతులు ఆకాశమంతా వ్యాపించాయి. అతని కడుపులో ఉన్న లోకాలన్నీ ఒక్కసారిగా కదిలి, అలజడి చెందాయి. ఆయన భుజం మీద వేలాడుతున్న పీతాంబరం కిందకు జారిపోయింది. చేతిలో చక్రాన్ని ధరించి వేగంగా మీదకు వెడుతుండగా, ‘‘నా శక్తి మీద నాకు నమ్మకం ఉంది, నన్ను నువ్వు నవ్వులపాలు చేయకు కృష్ణా’’ అని అర్జునుడు బతిమాలుతుంటే, ‘‘నన్ను అడ్డగించకు. ఈరోజు భీష్ముడిని చంపి, నిన్ను రక్షిస్తాను’’ అంటూ ఏనుగు మీదకు లంఘించే సింహంలాగ, నా బాణాలను తప్పించుకుని నా మీదకు ఉరుకుతూ వచ్చే ఆ కృష్ణుడే దిక్కు నాకు’’ అన్నాడు భీష్ముడు.
-- References Youtube, http://www.sakshi.com/main/Weeklydetails.aspx?Newsid=27675&Categoryid=13&subcatid=0, http://padyakaumudi.blogspot.in/
IN WHICH SKANDA THIS POEM IS?
ReplyDeletebhishma parvam, mahabharatham
DeleteThis comment has been removed by the author.
ReplyDeletei can confidently clear the doubt now. the poem is a composition of Sri Pothana and is found in prathama skandha , 9th chapter, poem number 221.
ReplyDeletethe incident is recorded by Sage Vyasa in Bharatham, in Bheeshma parva.
the Bhagavatham chapters are not parvas. they are skandhas. Pothana did not write mahabharatam as far as i know. his works include veerabhadra vijayam but not bharatham.
so this poem's author is pothana in Bhagavatham, first skandha, 9th chapter, poem number 221. Sudhakar V.Rao MD
Yes.. This is from Andhra Mahabhagavatham translated by Sri Bammera Pothanamathya.._/\_
DeleteThis comment has been removed by the author.
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteపైన పేర్కొన్న పద్యం, శ్రీ పోతన గారిదే. ఇది ప్రథమ స్కంధము, 9 వ ఆధ్యా యము లో 221 వ పద్యము.
ReplyDeleteశ్రీ వ్యాస భగవానుల మహాభారతము లో ఈ క్రింది శ్లోకానికి అనువాదం వంటిది:
"సిత విశిఖ హతో విశీర్ణ దంశ:
క్షతజ పరిప్లుత ఆత తా యి నో మే
ప్రసభం అభిసార మద్వదార్థం ,(vadhaartham) sorry for the telugu typo.
స తు భవతు మే భగవాన్ గతిర్ ముకుంద:
There is no mention of sudarsana chakram in this poem. Correct this mistake.
ReplyDeleteసగటు వెయ్యి మార్లు విని వుంటాను ఈ పద్యము.. ఇంకా వింటూనే వుంటాను... చాల థ్యాంక్స్ భాస్కర్... నేను శర్మ హైదరాబాద్ ... @ 9908496399
ReplyDeleteThis poem hut my heart
ReplyDeleteAudio or mp3 download link please
ReplyDeleteUnimaginable itlhasa, unimaginable description and unimaginable beauty of the poetry.
ReplyDeleteFeel so fortunate to know this great writing by Vyasa and Potana.
ఓ పార్థా నన్ వదులుమా.రాయబారంబుల కురు సభలో దుర్యోధనుండు సూది మోపినంత ధరణినివ్వన్.సంగరంబున గెలుపుల వీరుల్ వారి ..రాజ్యంబు పొందవలయున్.అనివిర్రవీగెన్ .అపుడు ఓయీ దుర్యోధనా ఏమనుచుంటివి
ReplyDeleteచాలా ఆనందమా యెన్. సరిపోయే.ఈ కౌరవ సభామాధ్యంబుల నీవున్గాని నీదు సంరక్షణల గాచుచుండు ధ్యేయంబైన భీష్మ ద్రోణ కృపాచార్యుల్ నిన్ సంరక్షణల గాచుచుండు అను నెవ్వరైనన్ సఃదిమోపినంత ధోరణిపై .నిల్వంగ గలిగరేని పాండవులు రాజ్యంబు మీరు మాయా జూదంబున.పొందిన రాజ్యంబు పాండవులను మెప్పించిద ఒప్పించి నీదుపాదాక్రాంతంబు జేయించెదన్ అని దెలిపినపుండు ఒక్కండునూ దుర్యోధనుని వారించిందిక పోయిరన్
దుష్ట దుర్నీతి ద్వయంబుల అధర్మంబుల వర్తనల వారికి వెళ్ళినాడు అండగా నుండినన్ నాదు అవతార ధర్మంబుల ధ్యేయంబుల భూదేవి భారంబుల నుండీ దప్పించుచుండెదన్
దాని పర్వవసానంబే తెలుగు భీష్మని భూదేవి భారంబుల నుండీ
కంటిన్యూ.దప్పించటలో ధర్మాచరణ అవతార ధారణంబుల ధర్మనిరతుల గావించెదనన్.అని పలికిన శ్రీ క్రిష్ణ పరమాత్మ తో వాసుదేవా ఏది ఏమైనా భీష్మ పితామహుడు పూజనీయుండు.ఆగుమా అనుచు పరమాత్మను శాంతింజేసెన్.మహానుభావులారా. ఊహాజనిత పదకవిత. ఈచిరు ఉడుత కుచేలుని వంటి వాడిని సహృదయ సద్విమర్శల సూచనలు సలహాల ఆశీలందించమా. ఎందరో మహానుభావులు అందరికీ వందనములు అభినందనలు.బరూరి.సుబ్బరాయ శర్మ ఒంగోలు ప్రకాశం జిల్లా రిటైర్డ్ పోలీస్ డిపార్ట్మెంట్ ప్రస్తుతం హైదరాబాద్ ధన్యవాదాలు ఓం నమో భగవతే వాసుదేవాయ నమః.
ReplyDeleteసవరణ ఆశీలందించుమా.
ReplyDeleteసవరణ .సూది మోపినంత ధరణిపై .
ReplyDelete